ఏపీతో కలిసి పనిచేయడానికి సిద్ధం  | Japan Team Interested to Invest In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీతో కలిసి పనిచేయడానికి సిద్ధం 

Nov 7 2021 3:28 AM | Updated on Feb 21 2022 12:46 PM

Japan Team Interested to Invest In Andhra Pradesh - Sakshi

మంత్రి మేకపాటితో జపాన్‌ బృందం

నెల్లూరు(సెంట్రల్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు జపాన్‌ ప్రత్యేక బృందం తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల పెట్టుబడులు, ఇతర విషయాలపై చర్చించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని జపాన్‌ ప్రతినిధులు టెక్‌ గెంట్సియా సీఈవో జాయ్‌ సెబాస్టియన్, మార్కెటింగ్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డెనిస్‌ యూజిస్‌ అరకవల్‌ తదితరులు శనివారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.

ఏపీతో కలసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమలు, నైపుణ్య రంగాల్లో తీసుకుని వస్తోన్న వినూత్న సంస్కరణలతో పాటు, యువతకు ఉపాధి పెంచడం కోసం చేపడుతున్న చర్యలను జపాన్‌ బృందానికి మంత్రి వివరించారు. రెండు రోజుల్లో మరోసారి భేటీ అయ్యాక పలు అంశాలపై చర్చించి ముందుకు వెళతామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లూ ఓషియాన్‌ బిజినెస్‌ ఫెసిలిటేషన్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ బెన్సి జార్జ్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement