గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి.. స్పందించిన హోంమంత్రి

Home Minister Taneti Vanitha Responds To Attack On MLA Talari Venkatrao - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎండాడలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే దిశ యాప్, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి: AP: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

మహిళలపై దాడులను సీఎం జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వారే దాడులు చేసి వారే తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన టీడీపీ నేత పై కేసు నమోదు చేశామన్నారు...

జి.కొత్తపల్లి ఘటనపై స్పందిస్తూ..
ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడిపై ఆమె స్పందిస్తూ.. ఎమ్మెల్యేపై జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నానన్నారు. ఇప్పటికే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. దాడి ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top