Eluru: Hight Tensions Over Rivals Attack On MLA Talari Venkatrao - Sakshi
Sakshi News home page

ఏలూరు: కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేపై ప్రత్యర్థుల దాడి

Apr 30 2022 10:34 AM | Updated on Apr 30 2022 12:30 PM

Eluru: Hight Tensions Over Rivals Attack On MLA Talari Venkatrao - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య క్రమంలో పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేపై దారునానికి తెగపడింది ప్రత్యర్థి వర్గం.

సాక్షి, ఏలూరు: ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత దారుణ హత్యకు గురికాగా, పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై ప్రత్యర్థి వర్గం దాడికి యత్నించింది.  

జి. కొత్తపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్‌ గంజి ప్రసాద్‌పై కొందరు దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌ చేరుకోగా, ప్రత్యర్థి వర్గం ఎమ్మెల్యేపై ఒక్కసారిగా దాడికి యత్నించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో వలయంగా ఏర్పడి.. ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. 

వ్యక్తిగత కారణాలా? ఆస్తి వివాదాలా? లేదంటే రాజకీయ వైరంతోనే గంజి ప్రసాద్‌ను హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement