విశాఖ మన్యంలో హైఅలర్ట్ | Sakshi
Sakshi News home page

విశాఖ మన్యంలో హైఅలర్ట్

Published Tue, Sep 22 2020 9:48 AM

High Alert In Visakhapatnam Agency - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే క్రమంలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో యాక్షన్‌ టీమ్‌లు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మన్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీంతో అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు. కొన్ని ప్రాంతాల్లో కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించారు. వారం రోజులపాటు కొనసాగే ఈ వారోత్సవాల్లో కొంత అలజడి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మన్యం ప్రజలు భయపడుతున్నారు. (పచ్చని అడవికి నెత్తుటి మరకలు)

Advertisement
 
Advertisement
 
Advertisement