చంద్రబాబు పీలేరు పర్యటన.. ‘సైకో చంద్రబాబు గో బ్యాక్‌’ అంటూ ఫ్లెక్సీలు

Go Back Chandrababu Flexis At Pileru Protest Against TDP Chief - Sakshi

సాక్షి, అన్నమయ్య: చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ పీలేరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మత కలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ ఫ్లెక్సీల దర్శనమిచ్చాయి. ‘ గోబ్యాక్‌ చంద్రబాబు.. పుంగనూరులో మత కలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు గో బ్యాక్‌.. సైకో చంద్రబాబు గో బ్యాక్‌’ అని కొందరు బాబు రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలతో నిరసించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడులు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ గాయపడిన వారి ఫోటోలను ఫ్లెక్సీల్లో ఉంచారు. 

కాగా, పీలేరు సబ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి సోమవారం చంద్రబాబు వెళ్లారు. ములాఖత్‌కు బాబుతోపాటు ఆరుగురు అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో సైకో చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ పీలేరు రైల్వే ట్రాక్‌ వద్ద ఫ్లెక్సీలు కనిపించాయి. బాబు పీలేరు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు హాట్‌టాపిక్‌గా మారాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top