పెళ్లింట తీవ్ర విషాదం : నలుగురు మృత్యువాత | Four drowned tragedy has occurred in Kurnool district in AP | Sakshi
Sakshi News home page

పెళ్లింట తీవ్ర విషాదం : నలుగురు మృత్యువాత

Mar 27 2026 4:58 PM | Updated on Mar 27 2026 5:26 PM

Four drowned tragedy has occurred in Kurnool district in AP

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బందువుల పెళ్లికి వచ్చిన వారిని మృత్యువు కబళించింది. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు  ఒక్కసారిగా బంధువుల రోదనలతో విషాదంగా మారిపోయింది.

కర్నూలు జిల్లాలోని కందుకూరు గ్రామానికి పెళ్లికి వచ్చారు కర్ణాటకకు చెందిన కొంతమంది బంధువులు.  దాదాపు 15 మంది కోసిగి  ఆర్డీఎస్‌  ఆనకట్ట వద్ద స్నానానికి దిగారు. అయితే అనుకోకుండా వీరు ప్రమాదానికి గురైనారు. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను  కర్ణాటకలోని కురిడి గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దాసరి శివాసనంద, దాసరి ఉమావతి, దాసరి రత్నమ్మ మహేష్‌గా  గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement