Fact Check: ప్రాణాలు పోతున్నా ఆగని టీడీపీ ప్రచార యావ.. ఫేక్‌ వీడియోలతో..

Fact check: TDP posting fake news social media kuppam visuals - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ దొంగ నాటకాలు మరోసారి బయటపడ్డాయి. తప్పుడు ట్వీట్లతో ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే చంద్రబాబు సభలకు జనం రాక ఇబ్బందులు పడుతూ ఇరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించి కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు మరణాలకు కారణమయ్యారు. ఈ నేపథ్యంలోనే లేని జనాన్ని చూపిస్తూ కుప్పంలో చంద్రబాబు సభకు వచ్చిన జనం అంటూ ఆ పార్టీ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను  పోస్ట్‌ చేశారు. 

చదవండి: (నాకే రూల్స్‌ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం)

మాలతీ రెడ్డి టీడీపీ అనే అకౌంట్‌తో పోస్ట్‌ చేసిన వీడియోను పరిశీలించి చూస్తే.. ఇది పక్క రాష్ట్రానికి సంబంధించిందిగా తేలింది. కర్ణాటక రాష్ట్రం విజయపురలోని జ్ఞానయోగాశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వర సామిజీ సోమవారం రోజున తుదిశ్వాస విడిచారు. ఆయనను చివరి చూపు కోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు.

ఆ వీడియోను తీసుకొచ్చి టీడీపీ శ్రేణులు కుప్పం చంద్రబాబు సభకు హాజరైన జనంగా చూపించే ప్రయత్నం చేసి మరోసారి విమర్శల పాలయ్యారు. ఇదే వీడియోను ఎల్లోమీడియా కూడా ప్రమోట్‌ చేయడం వారి దిగజారుడు తనానికి పరాకాష్ట​.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top