
కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని గట్టిగా చెప్పండి అంటూ అల్టిమేటం ఇచ్చారు యనమల కృష్ణుడు.
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల సోదరుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. తుని సీటు విషయంలో ఇద్దరి మధ్య పంచాయితీ ముదిరింది. తుని నుంచి తన కూమార్తెను బరిలోకి దింపనున్నట్లు యనమల రామకృష్ణుడు సంకేతాలిచ్చారు. దీనిపై ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుట ఎగురవేశారు.
ఈ విషయంపై తొండంగి పార్టీ నేతతో యనమల సోదరుడు కృష్ణుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. గ్రామానికి 40 మంది చొప్పున వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి అంటూ ఆయన పిలుపునివ్వడం ఫోన్ సంభాషణలో స్పష్టంగా ఉంది. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని గట్టిగా చెప్పండి అంటూ అల్టిమేటం ఇచ్చారు యనమల కృష్ణుడు. దీంతో తుని టీడీపీలో రచ్చ మొదలైంది.
ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?