ఏపీలో టెస్టులు భేష్‌ : బ్రిటీష్‌ హైకమిషనర్‌

Deputy High Commissioner to India Jan Thompson applauds Ap Govt - Sakshi

ఏపీలో టెస్టులు, ట్రేసింగ్‌ భేష్‌.. బ్రిటిష్‌ హైకమిషనర్‌ ప్రశంస

సీఎం వైఎస్‌ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌

అంబులెన్స్‌ల నిర్వహణలో ఇంగ్లండ్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ భాగస్వామ్యం

సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌లు పాల్గొన్నారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాన్ థాంప్సన్ ప్రశంసించారు. (ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు)

జాన్‌ థాంప్సన్‌ ఏమన్నారంటే..
‘కోవిడ్‌ లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని దేశాలు కలిసిపనిచేయాల్సిన అవసరం ఉంది. భారత్‌ – యూకేలు రెండూ కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో కలిసి పనిచేస్తున్నాయి. పరిశోధనలు, వ్యాక్సిన్‌ తయారీ, ఔషధాల తయారీలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ యూకేలో తయారవుతోంది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.

భారీగా టెస్టులు చేయడంలో, పాజిటివ్‌ కేసులను గుర్తించండంలో ఆంధ్రప్రదేశ్‌ విశేషంగా పనిచేస్తోంది. అలాగే కరోనా మరణాల రేటు పూర్తిగా అదుపులో ఉండడం ప్రశంసనీయం. టెలీమెడిసిన్‌ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారు. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలను తీసుకుంటోంది. ఏపీ మెడ్‌ టెక్‌జోన్‌తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కరోనా నివారణకోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ విషయంలో స్టార్టప్‌ కంపెనీలను యూకే ప్రోత్సహిస్తుంది. కరోనా విపత్తును ఎదుర్కోనే ప్రక్రియలో కలిసి ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్‌ హెల్త్‌మిషన్‌ భాగస్వామంతో 108, 104 లాంటి అంబులెన్స్‌ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలను ఉపయోగించే అవకాశం ఉంటుంది’ అని జాన్‌ థాంప్సన్‌ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్‌ రావాల్సిందిగా వైఎస్‌ జగన్‌ను బ్రిటిష్‌ హైకమిషనర్‌ ఆహ్వానించారు. (కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225)

ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం : వైఎస్‌ జగన్‌
‘రాష్ట్రంలో కోవిడ్‌ టెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నాం. సగటున రోజుకు 62వేల వరకూ పరీక్షలు చేస్తున్నాం. 90శాతం పరీక్షలు కోవిడ్‌ క్లస్టర్లలోనే చేస్తున్నాం. దీనివల్ల కేసులు బాగా నమోదవుతున్నాయి. కోవిడ్‌ సోకిన వారిని వేగంగా గుర్తించి, వారిని ఐసోలేట్‌ చేయడానికి, వైద్యం అదించండానికి తద్వారా మరణాల రేటు తగించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏపీలో కరోనా మరణాల రేటు దేశం సగటుతో పోలిస్తే చాలా తక్కువ. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతంగా ఉంది. నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అన్ని రకాల పెద్ద ఆస్పత్రులు, వైద్య సేవలు అక్కడే అభివృద్ది చెందాయి. అలాంటి సదుపాయాలు ఇక్కడ లేవు. మేం అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే. ప్రస్తుతం ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను అభివృద్ధిచేస్తున్నాం. 16 కొత్త మెడికల్‌ కాలేజీలను, ఆస్పత్రులను తీసుకువస్తున్నాం. గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్‌ నిర్మిస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధనాసుపత్రులను బాగా అభివృద్ధిచేయబోతున్నాం. జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిచేస్తున్నాం. (టెలి మెడిసిన్‌ సేవలపై ఆరా తీయండి: సీఎం జగన్‌)

కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం దాంతో కలిసి బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈలోగా మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఆక్స్‌ఫర్డ్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ను డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. బ్రిటన్‌ సహకారం మారాష్ట్రానికి చాలా అవసరం ఉంది. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం. ఆస్పత్రులకు ఆలస్యంగా వస్తున్నందువల్లే కోవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. ఎంత త్వరగా వస్తే, అంతగామరణాలు తగ్గించవచ్చు. 10వేలకుపైగా రెమిడెసివర్‌ ఇంజక్షన్లు వాడి చాలా మందికి మెరుగైన వైద్యాన్ని అందించాం. త్వరగా ఆస్పత్రికి రావడం అన్నది చాలా ముఖ్యం’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

21-09-2020
Sep 21, 2020, 05:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగుల్లో లక్షణాలు, మరణాల సంఖ్యను చూస్తే వైరస్‌ తీవ్రత పెరగడంలేదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు....
21-09-2020
Sep 21, 2020, 03:47 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజా గణాంకాల ప్రకారం.....
20-09-2020
Sep 20, 2020, 15:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని...
20-09-2020
Sep 20, 2020, 10:17 IST
న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో...
20-09-2020
Sep 20, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది మంచి పరిణామమని వైద్య...
20-09-2020
Sep 20, 2020, 03:08 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో రికార్డు నమోదైంది. శనివారం ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రంలో...
19-09-2020
Sep 19, 2020, 21:02 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ...
19-09-2020
Sep 19, 2020, 17:28 IST
వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా కాలంలో ఫేస్‌మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయింది. కోవిడ్‌-19‌ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు దాదాపు...
19-09-2020
Sep 19, 2020, 16:03 IST
ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు...
19-09-2020
Sep 19, 2020, 15:08 IST
తొలి మూడు ఎపిసోడ్లు పాత్రల పరిచయంతో సరదాగా సాగిపోగా.. నాలుగో ఎపిసోడ్‌ నుంచి థ్రిలింగ్‌ మొదలవుతుంది. ఇక లాక్డ్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో సక్సెస్‌...
19-09-2020
Sep 19, 2020, 14:02 IST
ఎందుకు మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది ? సకాలంలో చికిత్స తీసుకోవడం వల్లన మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందా?
19-09-2020
Sep 19, 2020, 13:50 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పార్లమెంట్‌ సమావేశాలపై తీవ్రంగా పడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా...
19-09-2020
Sep 19, 2020, 13:33 IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌ తప్పనిసరి. అయితే మనలో చాలా మంది మాస్క్‌ను సరిగా...
19-09-2020
Sep 19, 2020, 10:08 IST
న్యూఢిల్లీ : భార‌త్‌తో క‌రోనా విజృంభిస్తోంది.  గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో  93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
19-09-2020
Sep 19, 2020, 04:51 IST
మాస్కో: రష్యా కరోనా టీకా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ భద్రతపై అనుమానాలు నెలకొ న్నాయి. టీకా డోసులు తీసుకున్న ప్రతీ...
19-09-2020
Sep 19, 2020, 04:43 IST
మాదాపూర్‌(హైదరాబాద్‌): సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో డిటెక్టివ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డీఎస్‌ఐ)గా పనిచేస్తున్న అబ్బాస్‌ అలీ(57) కరోనాతో...
19-09-2020
Sep 19, 2020, 04:39 IST
లండన్‌: యూకేలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. సెకండ్‌ వేవ్‌తో కేసులు రెట్టింపు అయ్యాయి. ఉత్తర ఇంగ్లండ్, లండన్‌లలో...
19-09-2020
Sep 19, 2020, 04:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారానికి రికవరీ రేటు 85.29...
19-09-2020
Sep 19, 2020, 04:28 IST
► అతని పేరు డాక్టర్‌ శివశంకర్‌ (పేరు మార్చాం). యాదాద్రి జిల్లాలోని ఒక పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌. అతనికి చౌటుప్పల్‌లోనూ ప్రైవేట్‌...
19-09-2020
Sep 19, 2020, 04:14 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్‌ ఎప్పటికి వస్తుందో నిర్దిష్టమైన అంచనాల్లేవు కానీ... ఆ వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top