డిసెంబర్‌ నాటికి 30 లక్షల మందికి ఇళ్లు

By December  30 Lakh Houses Will be Distributed says Malladi Vishnu  - Sakshi

విజయవాడ : ప్రజల సమస్యలు పరిష్కరించడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాల్లో ప్రజలు నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుని చిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదని, బాబు పరిపాలనలో అమరావతి, పోలవరం నాశనం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు 40 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకోవడమే కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మల్లాది విష్ణు అన్నారు.

సీఎం జగన్ ఈ రాష్ట్రంలో హౌస్ ఫర్ ఆల్ అనే నినాదంతో ముందుకు వెళ్లతున్నారని,  డిసెంబర్ 25 నాటికి 30 లక్షల మందికి ఇళ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై కూడా చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నాడని పేర్కొన్నారు. గతంలొ టీడీపీ నేతలు పేద ప్రజల వద్ద నుంచి  ఇల్లు ఇస్తామని రూ.25 ,50 వేలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 400 కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టామని, రాబోయే స్థానిక నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయఢంకా మ్రోగిస్తామని మల్లాది విష్ణు విశ్వాసం వ్యక్తం చేశారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top