
మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సివిల్స్ విజేతలు
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్ర కేడర్‌లో పనిచేసినా ఏపీకి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సివిల్స్ విజేతలకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రం నుంచి ఇటీవల సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన 10 మంది మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారు. వృత్తిలో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.