హైందవ ప్రజానీకానికి ఆరాధ్యుడు భగీరథుడు | Bhumi Puja of the idol of Maharshi Bhagiratha | Sakshi
Sakshi News home page

మహర్షి భగీరథ విగ్రహ భూమి పూజ...

May 13 2021 9:12 PM | Updated on Oct 12 2021 11:55 AM

Bhumi Puja of the idol of Maharshi Bhagiratha - Sakshi

కర్నూలు : నంద్యాలలో తొలి భగీరథుడి విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నంద్యాలకు సమీపంలోని రైతునగరంలో కీ.శే. ఇమ్మడి వెంకట రామయ్య గారి స్థలంలో భగీరథుని విగ్రహానికి సగరులు భూమి పూజ చేయ సంకల్పించారు. ఈ నెల 19వ తేదీ బుధవారం వైశాకశుద్ద సప్తమి నాడు భగీరథ జయంతి సందర్భంగా ఈ బృహత్కార్యాన్ని తలపెట్టారు. రాబోవు తరాలు భగీరథ మహర్షి గురించి తెలుసుకోవాలనే సదుద్దేశంతో భూమి పూజ చేస్తున్నామని తెలిపారు. సగర(ఉప్పర) ప్రజలు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. భగీరథుడు ఒక్క సగర ప్రజలకే కాదు..యావత్ హైందవ ప్రజానీకానికి ఆరాధ్యుడు, పూజనీయుడు. అటువంటి మహర్షి విగ్రహ భూమి పూజకు ప్రజలందరూ వచ్చి తీర్థ, ప్రసాదాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement