
అనంతపురం జిల్లా : పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ జిల్లాలోని సింగనమల మండలం నాగలగుడ్డం తండాకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి మృతిచెందాడు. సింగనమల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలో కోల్పోయాడు. దాంతో అతని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మృతదేహంతో సింగనమల పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. నిన్న(ఆదివారం, సెప్టెంబర్ 14 వ తేదీ) పేకాట ఆడుతూ రామకృష్ణ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు.
అయితే ఈ ఉదయం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కొట్టడంతోనే రామకృష్ణ చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్ట్రెచర్‌పై పెట్టుకుని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు తీవ్రంగా కొట్టిన కారణంగా సృహ కోల్పోయిన రామకృష్ణను ఆస్పత్రిలో చేర్పించారని, కానీ అతను చనిపోయాడని బంధువులు అంటున్నారు. దీనికి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
