AP Governor Abdul Nazeer Extends Ugadi Wishes To Telugu People - Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు

Published Tue, Mar 21 2023 1:02 PM

Ap Governor Abdul Nazeer Ugadi Wishes To Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది' పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే ఈ నూతన సంవత్సరం.. అందరికీ కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

‘‘జీవితంలోని షడ్రుచులను కలగలిపి ఉండే 'ఉగాది పచ్చడి', ఏడాది పొడవునా జీవితం మనకు అందించే అన్ని రకాల అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ‘శోభకృతు’ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగిస్తుందని నేను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను’’ అని గవర్నర్‌ అన్నారు.
చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

Advertisement
 
Advertisement