ఏపీ: 24 గంటల్లో 2,949 కేసులు | AP Covid Update Today 2949 Cases Recorded | Sakshi
Sakshi News home page

ఏపీ: 24 గంటల్లో 2,949 కేసులు

Oct 28 2020 7:16 PM | Updated on Oct 28 2020 7:41 PM

AP Covid Update Today 2949 Cases Recorded - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 77,028 మందికి పరీక్షలు నిర్వహించగా..  2,949 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన మొత్తం పరీక్షల సంఖ్య  77,73,681కి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,609మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు 7,81,509  మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్ర‌స్తుతం 26,622 యాక్టివ్ కేసులున్న‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 18 మంది కోవిడ్‌తో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,643కి చేరుకుంది. (చదవండి: ఆ విమానాశ్రయానికి అనూహ్య నష్టం)

Advertisement
 
Advertisement
Advertisement