సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ

AP CM YS Jagan to Hold Cabinet Meeting Cabinet Reshuffle - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతోపాటు, అనేక నిర్ణయాలను తీసుకున్నారు. 

కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్‌ చివరి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ సహా కేబినెట్‌ మంత్రులు అభినందించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత కేబినేట్‌లో అవకాశం ఇచ్చినట్లు సీఎం జగన్‌ తెలిపారు.. ఇప్పుడున్న వారంతా పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని, తమకున్న విశేష అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ఈ కేబినెట్‌లో ఉన్న మంత్రులందరూ మంచివాళ్లే. మీలో కొందరు మంత్రులుగా కొనసాగుతారన్నారు. భవిష్యత్‌లో మీకెవ్వరికి గౌరవం తగ్గదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లు మళ్లీ మంత్రులుగా వస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

కాగా, మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం జగన్‌తో అన్నారు.

చదవండి: (ద్వేషించేవాళ్లను ఏం అంటాం?: సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top