ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్‌

Published Mon, Feb 12 2024 5:32 AM

Andhra Pradesh is first in digital medical services - Sakshi

సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్‌ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. 

రక్తహీనత నివారణ చర్యల్లో భేష్‌ 
రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్‌వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్‌ హెల్త్‌ యాప్‌తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. 

డిజిటల్‌ వైద్య సేవల్లో ఫస్ట్‌ 
ప్రజలకు డిజిటల్‌ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్‌లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్‌లోడ్‌ చేయడం, భవిష్యత్‌లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్‌ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్‌ అకౌంట్‌లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్‌ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి.

డిజిటల్‌ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్‌ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. 

ఆరోగ్య ధీమా 
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్‌ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కు­టుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జ­నా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్‌ ప్రశంసించింది.  

2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ
► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం
►గ్రామాల్లో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు 

►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు 
► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం.

Advertisement
 
Advertisement
 
Advertisement