సాగునీటి వనరుల్లో ‘అనకాపల్లి’ ముందంజ 

Anakapalli Gests Top In Irrigated Water Resources - Sakshi

ప్రధాన ప్రాజెక్టులన్నీ ఈ జిల్లాలోనే.. ​​​​​​

లక్ష ఎకరాలకు నీరందే అవకాశం

వ్యవసాయ రంగానికి శుభసూచకం

ఒక ప్రాంతం అభివృద్ధికి నీరు ఎంతో అవసరమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వ్యవసాయపరంగా జిల్లా బాగుండాలంటే సాగునీరందించే వనరులు అవసరం. ఒక మేజర్‌ ప్రాజెక్టుతోపాటు ఐదు జలాశయాలు అందుబాటులో ఉండడం కొత్త జిల్లా అనకాపల్లికి వరం కానుంది.  

నర్సీపట్నం: పునర్‌వ్యవస్థీకరణలో కొత్త జిల్లాగా అవతరించి న అనకాపల్లి.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నీటివనరుల్లో సింహభాగాన్ని చేజిక్కించుకుంది. ఏకైక మేజరు ప్రాజెక్టు ‘తాండవ’తోపాటు దాదాపుగా ప్రధాన నీటి పథకాలన్నీ అనకాపల్లిలోనే చేరాయి. ప్రధానంగా వ్యవసాయంతోపాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందేందుకు ఇవి దోహదం చేయనున్నాయి. పెద్దేరు, రైవాడ, కోనాం, కల్యాణపులోవ, రావణాపల్లి వంటి సాగునీటి ప్రాజెక్టులు ఈ జిల్లా పరిధిలో ఉండడంతో వరి సాగుకు అవసరమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి.

దీంతోపాటు భవిష్యత్తులో వచ్చే పోలవరం ఎడమ కాలువ ఆధారంగా ఈ జిల్లాలోనే అధిక విస్తీర్ణానికి సాగునీరందించే అవకాశం ఉంది. ఏటా నవంబరులో వచ్చే తుఫాన్‌ ప్రభావాల వల్ల రిజర్వాయర్లన్నీ నిండుతాయి. వర్షాలు కరుణించకపోయినా ఖరీఫ్‌లో ఈ నీటిని సమృద్ధిగా వాడుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయకట్టు రైతులకు వరి సాగు చేసేందుకు ఢోకా ఉండదు. దీనివల్ల పరోక్షంగా అధిక ఆదాయం సమకూరి రైతాంగం నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న ఏలేరు కాలువ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తాండవ జలాశయానికి అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం రూ.470 కోట్లు కేటాయించింది. ఏలేరు కాలువ నుంచి తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరడంలో కీలకపాత్ర వహిస్తున్నారని కొనియాడారు. కరోనా కాలంలో వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందించారన్నారు. వారి సేవలను గుర్తిస్తూ రూ.470 కోట్లను ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాల రూపంలో అందిస్తోందన్నారు. మొదటిసారిగా మంత్రి పదవితో వచ్చిన తనను అనకాపల్లి ప్రజలు అక్కున చేర్చుకున్నారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాలుగింతలు కష్టించి పనిచేస్తానని పేర్కొన్నారు. ఎప్పటికీ మీలో ఒకడిగా, మీ బిడ్డగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌ ఘనంగా సత్కరించారు. ఎంపీ డాక్టర్‌ సత్యవతి, ఆర్డీవో చిన్నికృష్ణ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ భీశెట్టి వరహా సత్యవతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, గ్రామ సర్పంచ్‌ తట్టా పెంటయ్యనాయుడు, కశింకోట ఎంపీపీ కలగా గున్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

 ప్రగతి పరుగులు తీస్తుంది.. 
సాగునీటి ప్రాజెక్టులు సమృద్ధిగా ఉన్నందున జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. తాండవ ఎత్తిపోతల పథకం, పోలవరం కాలువ పనులు పూర్తయితే జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. వేగవంతంగా అభివృద్ధి చెందే జిల్లాలతో పోలిస్తే అనకాపల్లి ముందు వరుసలో ఉంటుంది.  
– రాజేంద్రకుమార్, తాండవ ప్రాజెక్టు, డీఈఈ, నర్సీపట్నం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top