గోదావరి, కృష్ణా నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంది: మంత్రి అంబటి

Ambati Rambabu Says Rivers Are Likely Flood Due To Heavy Rains - Sakshi

సాక్షి, విజయవాడ: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఎగువన నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నాయి. 

కాగా, తాజాగా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయని స్పష్టం చేశారు.

టీడీపీ హయంలో నామినేషన్‌ పద్దతిలో కాంట్రాక్టులు కట్టబెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ విధానం తెచ్చారు. రివర్స్‌ టెండరింగ్స్‌తో రూ. 800 కోట్లు తగ్గాయి. వరదల వల్ల లోయర్‌ కాపర్‌ డ్యాం పనులకు ఆటంకం ఏర్పడింది. చంద్రబాబు చేసిన తప్పులకు మేము బాధ్యత వహించా?. లోయర్‌, అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తివకుండానే డయాఫ్రమ్‌వాల్‌ కట్టారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ఈ మాట చెప్పారని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: టీవీ5, ఏబీఎన్‌ యజమానులు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి: గోరంట్ల మాధవ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top