సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం

Actions to complete projects as planned - Sakshi

సాక్షి, అమరావతి:  కడలి పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు దివంగత వైఎస్సార్‌ చేపట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.

గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా వరుసగా నాలుగేళ్లు  ఖరీఫ్, రబీలో కోటి ఎకరాలకు నీళ్లందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం వరుసగా నాలుగేళ్లు ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో ఏటా సగటున 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 

నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం 
టీడీపీ హయాంలో 2014–19 దుర్భిక్ష పరిస్థితు­లు నెలకొనగా సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం సుభిక్షంగా మారింది.  

 నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిం­­చడం ద్వారా పులిచింతల (45.77 టీఎంసీలు), గండికోట (26.85 టీఎంసీలు), చిత్రా­వతి (పది టీఎంసీలు), సోమశిల (78 టీఎంసీలు), కండలేరు(68.03 టీఎంసీలు), గోరకల్లు (12.44 టీఎంసీలు), అవుకు (4.15 టీఎంసీలు) రిజర్వాయర్ల­లో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. 

తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయ­ర్‌­లో 2019 నుంచే ఏటా గరిష్ట స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్‌ మట్టిక­ట్టకు డయాఫ్రమ్‌వాల్‌ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020లో గరిష్ట స్థాయిలో 17.74 టీఎంసీలను  నిల్వ చేశారు. తద్వారా తెలుగుగంగ ప్రా­జె­క్టు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా మార్గం సుగమం చేశారు.  

శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రో­జుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్ర­కా­శం జిల్లాలో ప్రాజెక్టులను నింపేలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, కాలువలను ఆధునికీకరించే పనులను చేపట్టారు.  

మహోజ్వల ఘట్టం 
సాగునీటి ప్రాజెక్టులను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యత క్రమంలో చకచకా పూర్తి చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశా­రు. ఈ రెండు బ్యారేజ్‌ల ద్వారా నెల్లూ­రు జిల్లాలో 4,84,525 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా పరీవాహక ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు.

జలాశయంగా రూపుదిద్దుకున్న పోలవరం
పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ మహానేత వైఎస్సార్‌ జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. వంద శాతం వ్యయం భరించి పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్ల దాహంతో 2013–14 ధరలకు తామే పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు చెప్పడంతో 2016 సెపె్టంబర్‌ 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఆ తర్వాత లాభాలు వచ్చే పనులను చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు గాలికి వదిలేశారు.  

కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం.  చంద్రబాబు పాపాల ఫలితంగా గోదావరి వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌  వాల్‌ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ గోతులు ఏర్ప­డ్డాయి. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి  వ­చ్చా­­క పోలవరాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూ­పొందించి  పనులు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top