ఏపీలో కొత్తగా 338 కరోనా కేసులు | 338 New Coronavirus Cases Recorded In Andhra Pradesh In 24hours | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 338 కరోనా కేసులు

Dec 31 2020 5:32 PM | Updated on Dec 31 2020 5:38 PM

338 New Coronavirus Cases Recorded In Andhra Pradesh In 24hours - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 338 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా  నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,82,286కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి గుంటూరు, వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం,పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7108 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 328 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు మొత్తంగా 8,71,916 మంది కోలుకున్నారు.  ఏపీలో ప్రస్తుతం 3,262 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 1,18,25,566 శాంపిల్స్‌ను పరీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement