New Covid Cases In AP Last 24 Hours: ఏపీలో కొత్తగా 22,399 కరోనా కేసులు - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 22,399 కరోనా కేసులు

May 13 2021 6:09 PM | Updated on May 13 2021 6:30 PM

22399 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 96,446 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,66,785 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 89 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,077కు చేరింది. గడిచిన 24 గంటల్లో 18,638 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 11 లక్షల 56 వేల 666 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,01,042 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,77,02,133 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement