వీరు ‘అమ్మ’లు కాదు.. తనయుల చేతిలో కీలు ‘బొమ్మ’లు. నవమాసాలు మోసినప్పుడు ‘భారం’ అనిపించుకోని వారు... మలి వయస్సులో బిడ్డలకు భారమయ్యారు. రెక్కల కష్టంతో బిడ్డలను పోషించి, వారికి దారితెన్ను చూపారు. తాను ఎన్ని త్యాగాలు చేసినా.. ఏనాడూ కాసింత డబ్బు అడిగింది లేదు.. బంగారు నగలూ అంతకన్నా లేదు. అవసాన దశలో వారు కోరుకున్నది కాసింత ప్రేమ.. ఆదరణ. అయితే ఇందుకు విరుద్ధంగా వారిని ఆదాయవనరుగా మార్చుకున్నారు. జనం సెంటిమెంట్‌తో వ్యాపారానికి తెరలేపారు. రోజూ ఉదయం అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ప్రసన్నాయపల్లెకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన వదిలి వెళుతున్నారు. వారు భిక్షాటన ద్వారా సంపాదించిన డబ్బును తీసుకుని రాత్రికి ఇళ్లకు పిలుచుకెళుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:


