అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో శుక్రవారం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.52 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 420 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.52 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.35 వేల ప్రకారం ధర పలికాయన్నారు. మల్లికా రకం మామిడి కాయలు టన్ను గరిష్టంగా రూ.48 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేలు పలికాయని తెలిపారు. ఇక హిమాయత్ రకం మామిడికాయలు టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ వెల్లడించారు.
యూకే కౌన్సిలర్‌గా
గుత్తి పూర్వ విద్యార్థి
గుత్తి: పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థి నవీన్ యూనైటెట్ కింగ్‌డమ్ నార్త్ చీమ్‌లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అనంతపురానికి చెందిన నవీన్ 15 ఏళ్ల క్రితం గుత్తి ఎస్కేడీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. అనంతరం యూకేకు వెళ్లి అక్కడ స్థిర పడ్డారు. ఈ క్రమంలో అక్కడ గురువారం జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. నవీన్ 1800 పై చిలుకు ఓట్లతో కౌన్సిలర్‌గా విజయం సాధించారు. నవీన్ అక్కా బావలు స్వరూప, రాఘవేంద్ర(చిన్ని) ప్రస్తుతం గుత్తిలో నివాసముంటున్నారు. నవీన్ యూకే ఎన్నికల్లో విజయం సాధించడంతో అనంత, గుత్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


