శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం పెనకచెర్ల డ్యాంకు వెళ్లే రహదారి పూర్తి అధ్వానస్థితికి చేరుకుంది. అడుగుకో గుంత చొప్పున కంకర తేలి రాకపోకలకు తీవ్ర
అసౌకర్యంగా మారింది. ద్విచక్ర వాహనాల చక్రాల కింద రాళ్లు పడి అదుపు తప్పి వాహన చోదకులు కిందపడుతున్నారని, ఈ మార్గంలో కనీసం నడవాలన్నా ఇబ్బందిగా ఉంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరకప్రాయంగా మారిన రహదారి మరమ్మతుకు ఇప్పటికై నా ప్రజాప్రతినిధి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:


