● భారీగా తరలి వచ్చిన క్రైస్తవులు
అనంతపురం కల్చరల్: ఈస్టర్ పర్వదిన రాకను పురస్కరించుకుని శనివారం అనంత పురవీధుల్లో ‘రన్ ఫర్ జీసెస్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రైస్తవులతో పాటు పాస్టర్లు, ఆధ్యాత్మిక ప్రసంగీకులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని అరవిందనగర్‌లో ఉన్న సీఎస్‌ఐ చర్చి వద్ద నుంచి సప్తగిరి సర్కిల్‌లోని టౌన్ కాంగ్రిగేషనల్ చర్చి వరకూ క్రీస్తు నామాన్ని బలపరుస్తూ ర్యాలీ సాగింది. కార్యక్రమాన్ని సీఎస్‌ఐ చర్చి డివిజనల్ చైర్మన్ రెవరెండ్ బెనహర్‌బాబు ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభించారు. కార్యక్రమ కో–ఆర్డినేటర్ మోజెస్ అనిల్‌కుమార్, చీఫ్ కన్వీనర్ జాన్ వెస్లీ, పాస్టర్ నెహమ్యా నాగరాజు, కన్వీనర్లు లింగాల రమేష్, స్వామిదాసు తదితరులు మాట్లాడుతూ.. రన్ ఫర్ జీసెస్ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఎస్‌ఐయూ వద్ద కార్యక్రమ చైర్మన్ రెవరెండ్ సంపత్ విజయ్‌కుమార్ ప్రత్యేక ప్రార్థనలతో ముగించారు. కార్యక్రమంలో వైస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు వైపీ బాబు, పురుషోత్తం, నగర అధ్యక్షులు సతీష్, చిలకల ధామస్, రాజ్‌కుమార్, జాన్ విజయ్‌కుమార్, సునీల్‌కుమార్, ప్రేయర్ కోఆర్డినేటర్ పాస్టర్ మనుష్యే, వైస్ చైర్మన్ యేషయ, కమిటీ సభ్యులు ఆడమ్స్, జీఆర్ ఆనంద్, జాన్ విక్టర్, ఇషాక్, జాషువా, వరప్రసాద్, సోలెమోన్, విల్సన్, కమల్, డేనియల్, తిమోతి, జానీ పాల్గొన్నారు.


