ప్రైవేటీకరణతో వైద్య విద్యకు పాతర
● చంద్రబాబు ప్రభుత్వంపై నిరసనాగ్రహం
ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల వద్ద కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్, సంతకాల కోసం తరలివచ్చిన విద్యార్థులు
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించి వైద్య విద్య, మెరుగైన వైద్యానికి పాతర వేయవద్దని ప్రజలు నినదించారు. ప్రభుత్వ వైద్యం, విద్య పొందడం ప్రజల హక్కు అని, ఆ హక్కును స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాయొద్దని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లా అంతటా ముమ్మరంగా సాగుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులు వైద్య కళాశాలలపై సర్కారు కుట్రను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. వైద్య కళాశాలలను పరిరక్షించుకునేందుకు విద్యార్థులు, యువత, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలూ ముందుకు వచ్చి సంతకాలు చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినదించారు.
బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం, ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల వద్ద సోమవారం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. శింగనమల నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎంమోహన్‌రెడ్డి హాజరయ్యారు.
గుంతకల్లు పట్టణంలోని 16, 7, 31వ వార్డుల్లో కోటి సంతకాల సేకరణ జోరుగా సాగింది. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఖలీల్, సీనియర్ నాయకుడు కాకర్ల నాగేశ్వరరావు, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు షాబుద్దీన్, 7వ వార్డు కౌన్సిలర్ లింగన్న పాల్గొన్నారు.
పామిడిలోని ఆరో వార్డులో వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, పట్టణ కన్వీనర్ నాగూరు ఈశ్వర్‌రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు షామీర్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది.
గుత్తి మండలం రజాపురంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నేత హాజీ మలంగ్ బాబా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు.
రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరులో సర్పంచ్ ఎగ్గిడి వరలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో వాటిల్లే నష్టాలను వివరించారు.
ప్రైవేటీకరణతో వైద్య విద్యకు పాతర


