● సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి ● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
చెన్నేకొత్తపల్లి: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 44వ జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తాపడింది. ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురక్ష (32) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి 30 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ (జబ్బార్) బస్సు మంగళవారం వేకువజాము సుమారు రెండు గంటల సమయంలో చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వై జంక్షన్ వద్దకు చేరుకోగానే ముందు వెళుతున్న ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తాపడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయడంతో సమీంలోని ధాబా, హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమై వెంటనే అక్కడకు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురక్ష ఆస్పత్రిలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సురక్షకు భర్త వినీత్, ఓ కుమార్తె ఉన్నారు. బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసేవారు. వినీత్ హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోం కావడంతో భర్త, కుమార్తె నిధితో కలసి సురక్ష... హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. కాగా, బస్పు అతి వేగమే ప్రమాదానికి కారణంగా ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. సురక్ష భర్త వినీత్ ఫిర్యాదు మేరకు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు ఇర్ఫాన్, మాలిక్‌తో పాటు ఐచర్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: స్థానిక తాడిపత్రి– చల్లవారిపల్లి రైలు మార్గంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాచిగూడ – మురవేడశ్వర్ రైలు కో–పైలెట్ ఇచ్చిన సమాచారంతో జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. 55 ఏళ్ల వయసున్న మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.
ఆంధ్ర క్రికెట్ జట్టులో పలువురికి చోటు
అనంతపురం కార్పొరేషన్: ఈ నెల 9 నుంచి బరోడాలో బీసీసీఐ ఆధ్వర్యంలో వన్డే క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర అండర్ –23 క్రికెట్ జట్టును ఆంధ్ర క్రికెట్ సంఘం మంగళవారం ప్రకటించింది. ఇందులో జిల్లాకు చెందిన పలువురికి చోటు దక్కింది. ఎంపికై న వారిలో ఎంకే దత్తారెడ్డి (వికెట్ కీపర్, బ్యాటర్, అనంతపురం), ఎస్.కామిల్ (ఆల్‌రౌండర్, గుంతకల్లు), మల్లికార్జున (స్పిన్నర్, రాప్తాడు) ఉన్నారు. స్టాండ్‌బైగా అర్జున్‌టెండూల్కర్ (గొట్లూరు)ను ఎంపిక చేశారు.
దత్తారెడ్డి కామిల్ మల్లికార్జున
ఐచర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఐచర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఐచర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఐచర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఐచర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఐచర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు


