30లోపు ఈ–క్రాప్ పూర్తి కావాలి
గుంతకల్లు: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకటన మేరకు... గుంతకల్లు–చైన్నె ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నవంబర్ 19,20,21,22 తేదీల్లో నడుస్తాయి. నవంబర్ 19న చైన్నె (06091)లో రాత్రి 11.30 గంటలకు రైలు బయలుదేరి గుంతకల్లు జంక్షన్‌కు గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది. తిరిగి ఈ రైలు 20న ఇక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు చైన్నె చేరుతుంది. యలహంక, హిందూపురం, పుట్టపర్తి సత్యసాయి నిలయం రైల్వేస్టేషన్, ధర్మవరం, అనంతపురం, గుత్తి మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుంది.
● కాచిగూడ–తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయి. నవంబర్ 6,13,20,27 తేదీల్లో (గురువారం) కాచిగూడ జంక్షన్ (07787) నుంచి రాత్రి 10.25 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 7,14,21,28 తేదీల్లో తిరుచూనూరు రైల్వేస్టేషన్ (07788)లో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ జంక్షన్ చేరుకుంటుంది. ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట జంక్షన్ మీదుగా రైలు ప్రయాణిస్తుంది.


