ఒకే ఈతలో నాలుగు పిల్లలు
గుత్తి రూరల్: లచ్చానుపల్లిలో రైతు నాగార్జునకు చెందిన మేక శనివారం ఒకే ఈతలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా మేకలు ఈతలో ఒకటి లేదా రెండు పిల్లలను ఈనుతాయి. అయితే నాగార్జునకు చెందిన మేక ఒకే ఈతలో నాలుగు పిల్లలను జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది.
బాధ్యతల స్వీకరణ
అనంతపురం రూరల్: బీసీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీగా రామసుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఈడీగా ఉన్న సుబ్రమణ్యం ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో మైనార్టీ కార్పొరేషన్ ఈడీ రామసుబ్బారెడ్డిని బీసీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీగా నియమిస్తూ కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రామసుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఈడీని కలసి శుభాకాంక్షలు తెలిపారు.


