28న డీఈఓ పోస్టుల భర్తీకి పరీక్ష
అనంతపురం మెడికల్: డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 28న ఉదయం 9 గంటలకు జేఎన్‌టీయూలోని సెంట్రల్ కంప్యూటర్ సెంటర్‌లో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో డీఈఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థుల జాబితాను అనంతపురం వెబ్‌సైట్‌లో ఉంచామని, అర్హత సాధించిన వారు పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
వైఎస్సార్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కృష్ణారెడ్డి
అనంతపురం: వైఎస్సార్‌సీపీ అనుబంధ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతంశెట్టి కృష్ణారెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.


