దంచికొట్టిన వాన
●‘అనంత’లో విరుచుకుపడిన వరుణుడు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో 50 మి.మీ, బుక్కరాయసముద్రంలో 72, అనంతపురం రూరల్ మండలంలో 70 మి.మీల భారీ వర్షపాతం నమో దైంది. అలాగే, ఉరవకొండలో 65 మి.మీ, ఆత్మకూరు 50 మి.మీ, రాప్తాడులో 40 మి.మీ, కూడేరు 32 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. నార్పల, విడపనకల్లు, కళ్యాణదుర్గం, వజ్రకరూరు, డి.హీరేహాళ్, శింగనమల, గుత్తి, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు తదితర మండలాల్లోనూ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షంతో అనంతపురం నగరంతో పాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి.
గాలిమరపై పిడుగు
కూడేరు: మండలంలోని కలగళ్లలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన జోరు వర్షం కురిసింది. గ్రామ సమీపాన గ్రీన్‌కో కంపెనీ ఏర్పాటు చేసిన గాలిమరపై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగి గాలిమర కాలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
దంచికొట్టిన వాన


