‘డైట్’లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
అనంతపురం సిటీ: బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీసు)పై భర్తీ చేయనున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 30, 31 తేదీల్లో స్క్రూటినీ, నవంబర్ 5 నుంచి 8 వరకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. నవంబర్ 13న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఖాళీల వివరాలు, విద్యార్హతలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం వెబ్‌సైట్ చూడాలన్నారు.
బీటీపీకి పెరుగుతున్న వరద
గుమ్మఘట్ట: రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు వరదాయినిగా ఉన్న బీటీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వేదవతి హగరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. దీంతో క్రమంగా బీటీప్రాజెక్టుకు నీరు చేరుతోంది. గురువారం నాటికి ప్రాజెక్టులో 1652.2 అడుగుల నీరు ఉన్నట్లు జలవనరుల శాఖ డీఈఈ గీతాలక్ష్మి తెలిపారు. క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉందన్నారు.
మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
● ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య
బుక్కరాయసముద్రం: గ్రామాలలో ఎవరైనా మద్యం అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. బీకేఎస్‌లోని ఎకై ్సజ్ కార్యాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం షాపులలో నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. మద్యం కొనుగోలు చేసే వ్యక్తులు ఏపీ ఎకై ్సజ్ సురక్షా యాప్‌ను డౌన్ లోడు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా బాటిల్ మూతపై క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా ఆ మద్యం గుర్తింపు పొందినదో, లేదో తెలిసిపోతుందన్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ రామమోహన్‌రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్, బీకేఎస్ ఎకై ్సజ్ సీఐ నాగ సునీత, సిబ్బంది పాల్గొన్నారు.
‘డైట్’లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు


