●జోడెద్దుల జోరు
● 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తిన ఎద్దులు
బొమ్మనహాళ్: జోడెద్దులు జోరుగా కదిలాయి. 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తి సన్మానం అందుకున్నాయి. ఈ అరుదైన ఘనతను బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన రైతుచిన్న బసయ్య పొలంలో గురువారం అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామి తన ఎద్దులతో కసలి సాధించాడు. ఇందుకు శివ, ఇస్సప్ప, రేవప్ప, రాముడు, వన్నప్ప సాయం తీసుకున్నాడు. కాడెద్దులతో గురువారం తెల్లవారుజాము 5 గంటలకు విత్తు పనులు చేపట్టి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎర్రిస్వామి ఎద్దులను గ్రామంలో ఘనంగా ఊరేగించి, సంబరాలు నిర్వహించారు.


