ప్రైవేటీకరణతో వైద్య విద్య దూరం
● కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య
బ్రహ్మసముద్రం: వైద్య కళాశాల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని, అంతేకాక పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా పోతాయని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మసముద్రం మండలం మామడూరులో ఆ పార్టీ మండల కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంగయ్య మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతులు తీసుకువచ్చారన్నారు. ఇందులో పలు కళాశాలల నిర్మాణాలున పూర్తయి తరగతులూ జరుగుతున్నాయన్నారు. రూ. 5 వేల కోట్ల కేటాయిస్తే మిగిలిన కళాశాలలూ పూర్తవుతాయన్నారు. అయితే నిధులు కేటాయించకుండా పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా ప్రైవేట్ వ్యక్తలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఈ కుట్రకు సీఎం చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం సూత్రధారులు టీడీపీ నేతలేనని స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ వీధివీధికీ బెల్టుషాపులు ఏర్పాటు చేసి ప్రతి బాటిల్‌పై రూ. 30 అదనంగా వసూలు చేస్తూ దోపిడీ సాగిస్తున్నారన్నారు. అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన అమిలినేని సురేంద్రబాబు.. ఎమ్మెల్యే అయిన తరువాత అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసి, దోపిడీకి తెరలేపారన్నారు. చివరకు బీటీపీ కాలువ మట్టిని కూడా ఎమ్మెల్యే విక్రయించుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామంలో సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోనాపురం గంగాధరప్ప, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, ఎంపీపీలు కంభం చంద్రశేఖర్‌రెడ్డి, భీమేష్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కై రేవు ప్రతాప్, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శులు గోపాలరెడ్డి, మంజునాథ, బూత్ కమిటీ విభాగం సునీల్, మండల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ హనుమంతరాయుడు, మండల ఉపాధ్యక్షులు రాము, మల్లికార్జున, వైస్ ఎంపీపీ బి.పల్లప్ప, ఎంపీటీసీలు శివన్న, తిప్పేస్వామి, సర్పంచ్‌లు రాంమ్మోహన్, నాగభూషణ, గంగాధర, ఎల్లప్ప, మండల కో ఆప్షన్ సభ్యుడు ఈశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ మహదేవప్ప, అనుబంధ సంఘాల అధ్యక్షులు అభిలాష్‌రెడ్డి, తిప్పేస్వామి, పాతలింగ, ఎరడికెర ఎర్రిస్వామి, తిమ్మారెడ్డి, శరణప్ప, మహలింగ, ఆర్‌ఎంపీ వసంత్, మంజు, శంకర్‌నాయక్, నాగిరెడ్డి, జనార్ధన, జానీ, నాయకులు అయ్యన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న తలారి రంగయ్య, సంతకాలు సేకరిస్తున్న రంగయ్య, పార్టీ శ్రేణులు
ప్రైవేటీకరణతో వైద్య విద్య దూరం


