ఏఎస్పీనే బెదిరిస్తే.. సామాన్యుల పరిస్థితేంటి? | - | Sakshi
Sakshi News home page

ఏఎస్పీనే బెదిరిస్తే.. సామాన్యుల పరిస్థితేంటి?

Oct 23 2025 2:31 AM | Updated on Oct 23 2025 2:31 AM

ఏఎస్ప

ఏఎస్పీనే బెదిరిస్తే.. సామాన్యుల పరిస్థితేంటి?

గుత్తి: ‘తాడిపత్రిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజే పోలీసుల సమక్షంలోనే రేయ్‌ ఏఎస్పీ.. ఎస్పీ లేకపోతే మీ ఇంట్లోకి దూరే వాడి నంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెదిరించారు. దీన్ని చూస్తే ఈ ప్రభుత్వంలో సామాన్యులకే కాదు.. చివరకు ఐపీఎస్‌లకూ రక్షణ లేని పరిస్థితి దాపురించిందనిపిస్తోంది. 24 గంటలు గడిచినా డీజీపీ, డీఐజీ, ఎస్పీలు స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తూ ఏఎస్పీనే లెక్కచేయకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంట’ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం గుత్తిలో పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్‌ బోయ తిప్పేస్వామి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అనంత’ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి పట్ల మునిసిపల్‌ చైర్మన్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. పోలీసుల గౌరవాన్ని పెంచుతామంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు సీఎం చంద్రబాబు చెప్పారని, అయితే అదే రోజు తాడిపత్రిలో ‘ఒరేయ్‌ ఏఎస్పీ’ అని టీడీపీ నేత సంబోధిస్తుంటే మీరు ఎలా పోలీసుల గౌరవాన్ని పెంచుతారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కాకుండా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు. డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు చీము,నెత్తురు ఉంటే చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వాలన్నారు. ఇలాగే కొనసాగితే సామాన్యులు కూడా పోలీసులను గౌరవించరన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనకు ఎదురు తిరిగినా, ప్రశ్నించినా రైలు పట్టాలపై పడుకోబెడ తానని బెదిరించినా కేసు పెట్టరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు జర్నలిస్టులను సైతం బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో వైద్య విద్యను ప్రైవేట్‌ పరం చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు

‘స్థానిక’ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌, అబ్జర్వర్‌ తిప్పేస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా కష్టపడి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌ సీపీ మోచేతి నీళ్లు గుమ్మనూరు తాగలేదా అని సూటిగా ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తామని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వన్నూర్‌బీ, వైస్‌ చైర్‌పర్సన్‌ వరలక్ష్మి, ఎంపీపీ విశాలాక్షి, పట్టణ, పార్టీ మండల కన్వీనర్లు మధు,గంగ రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, డాక్టర్‌ శాంతి ప్రియ, మాజీ ఎంపీపీ కోనా మురళీధర్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌, మాజీ కన్వీనర్లు పీరా, గోవర్దన్‌ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ విభాగం సంయుక్త కార్యదర్శి సీవీ రంగారెడ్డి, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నాయకురాళ్లు శ్రీదేవి, కళ్యాణి, భాగ్యమ్మ, లక్ష్మిదేవి, డాక్టర్‌ శాంతి ప్రియ, సుగుణమ్మ, కౌన్సిలర్లు వాల్మీకి శివ, కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌, బోయ తిప్పేస్వామి, కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

డీజీపీ, డీఐజీ, ఎస్పీల

చేతగాని తనంతోనే ఈ దుస్థితి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి

ఏఎస్పీనే బెదిరిస్తే.. సామాన్యుల పరిస్థితేంటి? 1
1/1

ఏఎస్పీనే బెదిరిస్తే.. సామాన్యుల పరిస్థితేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement