నాడి పట్టే వారేరీ?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ఇంటి వద్దకే వైద్యులు వెళ్లి సేవలందించే పరిస్థితి ఉండేది. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో పీహెచ్‌సీల్లోనే వైద్యులు లేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పీహెచ్‌సీల్లో 90 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఈ ప్రభుత్వం 50 మందిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ప్రజల నాడిపట్టే వైద్యులే కరువయ్యారు. అదేవిధంగా నెలలో ప్రతి గ్రామానికి రెండుసార్లు వెళ్లి సేవలందించే సంచార వైద్య సేవలూ (104) అటకెక్కాయి. ఎంఎల్‌హెచ్‌పీ, స్టాఫ్‌నర్సులే సేవలందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


