మూడో పట్టణ సీఐగా రాజేంద్రనాథ్‌యాదవ్
● సస్పెండ్ అయిన నెలల వ్యవధిలోనే పోస్టింగ్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు
అనంతపురం సెంట్రల్: నగరంలోని మూడో పట్టణ పోలీసుస్టేషన్ సీఐగా రాజేంద్రనాథ్ యాదవ్ నియమితులైనట్లు తెలిసింది. సస్పెండ్ అయిన నెలల వ్యవధిలోనే పోస్టింగ్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఇటీవల నగరంలో రామకృష్ణ కాలనీకి చెందిన యువతి ఎరికల తన్మయికి ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి కూడేరు మండలం గొటుకూరు సమీపంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.ముందురోజు బాధిత తల్లిదండ్రు లు వన్‌టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా సీఐ రాజేంద్రనాథ్ పట్టించుకోలేదు.ఈ క్రమంలో మరుసటి రోజే యువతి శవమై కనిపించడంతో ఉన్నతాధికారులు రాజేంద్రనాథ్‌ను సస్పెండ్ చేశారు. అయితే, ఐదు నెలలు తిరగకనే త్రీటౌన్ సీఐగా నియమితులు కావడం గమనార్హం. గతంలో టీడీపీ హయాంలో ఇటుకలపల్లి సీఐగా రాజేంద్రనాథ్ పనిచేశారు. ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి, కందుకూరు శివారెడ్డి హత్యల విషయంలో ఈయన వ్యవహార శైలి అప్పట్లో వివాదాస్పదమైంది.


