బుద్ధిమాంద్యం పిల్లల్లో దీపావళి వెలుగులు
కణేకల్లు: మండలంలోని కణేకల్లుక్రాస్‌లో ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో ఉన్న బుద్ధిమాంద్యం, మానసిక వికలాంగుల పాఠశాలలోని 150 మంది చిన్నారులతో కలసి దీపావళి సంబరాలను పోలీసులు నిర్వహించారు. ఆర్డీటీ అధికారుల అనుమతిలో సోమవారం రాత్రి రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్‌ఐ నాగమధు, ప్రొబేషనరీ ఎస్‌ఐ నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని తొలుత విందు భోజనం ఏర్పాటు చేయించారు. అనంతరం వెంట తీసుకెళ్లిన క్రాకర్స్‌ను కాల్పించారు. వేడుకల్లో ఆర్డీటీ ఆస్పత్రి ఇన్‌చార్జ్ దుర్గేష్, మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు.
అనాధ బాలికలతో దీపావళి
అనంతపురం సెంట్రల్: నగరంలోని కోవూరునగర్‌లో క్రీసెంట్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెయిన్‌బో హోంలో నాల్గో పట్టణ సీఐ జగదీష్ దీపావళి సంబరాలను నిర్వహించారు. అనాథ బాలికలతో కలసి బాణాసంచా పేల్చి పండగను ఆనందంగా జరుపుకున్నారు.
కణేకల్లులో చిన్నారులతో కలసి క్రాకర్స్ కాల్పిస్తున్న సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ నాగమధు
అనంతపురంలో అనాథ బాలికలతో టపాసులు కాల్పిస్తున్న అనంత నాల్గో పట్టణ సీఐ జగదీష్
బుద్ధిమాంద్యం పిల్లల్లో దీపావళి వెలుగులు


