ఎస్‌ఆర్‌ఐటీకి జాతీయ స్థాయి పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ఐటీకి జాతీయ స్థాయి పురస్కారాలు

Oct 18 2025 7:07 AM | Updated on Oct 18 2025 7:07 AM

ఎస్‌ఆర్‌ఐటీకి జాతీయ స్థాయి పురస్కారాలు

ఎస్‌ఆర్‌ఐటీకి జాతీయ స్థాయి పురస్కారాలు

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్‌) ఇంజినీరింగ్‌ కళాశాలకు జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి. ఈ మేరకు ఆ కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. ఏఐసీటీఈ–ఎడుస్కిల్స్‌ సంయుక్తంగా ఇటీవల దేశ వ్యాప్తంగా ఉన్న అటానమస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల వర్చువల్‌ ఇంటర్న్‌ షిప్‌ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కళాశాలల్లో ఎస్‌ఆర్‌ఐటీ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఘనతకు గుర్తింపుగా సిమ్లాలో ఎడుస్కిల్స్‌ కనెక్ట్‌’25 నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పురస్కారాలను ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాల వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి అందుకున్నారు. బెస్ట్‌ ఫర్మార్మింగ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అవార్డు, టాలెంట్‌ కనెక్ట్‌ ఎక్స్‌లెంట్‌ అవార్డు, ఫైవ్‌ ఇయర్స్‌ పార్ట్నర్‌ షిప్‌ అవార్డులు లభించినట్లు రంజిత్‌రెడ్డి తెలిపారు. అలాగే జెడ్‌స్కాలర్‌ ఇంటర్న్‌షిప్‌ డొమైన్‌, జూనియర్‌ ఇంటర్న్‌షిప్‌ డొమైన్‌, సెల్‌కోన్‌ ఇంటర్న్‌షిప్‌ డొమైన్‌, ఎడుస్కిల్స్‌ అకాడమీ ఇంటర్న్‌షిప్‌ డొమైన్‌ విభాగాలలో కూడా ఎస్‌ఆర్‌ఐటీలోని సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు ఉత్తమ అవార్డులు దక్కాయన్నారు. బోధనా విభాగంలోనూ ఎస్‌ఆర్‌ఐటీ ప్రతిభ చాటుకుందన్నారు. డాక్టర్‌ సాయి చైతన్య కిషోర్‌కు డైరెక్టర్‌ ఎక్సలెన్స్‌ అవార్డు, డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, వరుణ్‌కుమార్‌కు డెటికేటెడ్‌ సీఓఈ ఎడుకేటర్‌ అవార్డు, డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ యాదవ్‌కు బెస్ట్‌ ఫర్మార్మింగ్‌ సీఓఈ కోఆర్డినేటర్‌ అవార్డులు దక్కాయన్నారు. కళాశాల కరెస్పాండెంట్‌ ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ స్థాయిలో ర్యాంకులు, అవార్డులు సాఽధించడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడంలో అధ్యాపకులు చేసిన కృషి అభినందనీయం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement