
అదరగొట్టిన రాహుల్, అభినవ్
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం స్పోర్ట్స్ సెంటర్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న సీకే నాయుడు ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఆంధ్ర బ్యాటర్లు ఎస్‌వీ రాహుల్, అభినవ్ చెలరేగి సూపర్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 4 వికెట్లు కోల్పోయి 470 పరుగులు సాధించింది. గురువారం కురిసిన వర్షం కారణంగా శుక్రవారం రెండో రోజు మ్యాచ్ రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవర్‌నైట్ స్కోర్ 210/2తో బరిలో దిగిన ఆంధ్ర బ్యాటర్ తేజ ఆట ప్రారంభమైన కాసేపటికి పెవిలియన్ ముఖం పట్టాడు. ఈ దశలో జత కట్టిన ఎస్‌వీ రాహుల్, అభినవ్.. ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. నిలకడగా ఆడుతూ.. అవకాశం దొరికినప్పుడుల్లా బంతిని బౌండరీలు దాటిస్తూ భారీ స్కోర్‌కు బాటలు వేశారు. ఎస్‌వీ రాహుల్ 292 బంతులను ఎదుర్కొని 15 ఫోర్లు,2 భారీ సిక్సర్లతో 151 పరుగులు చేసి, క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. అభినవ్ 190 బంతుల్లో 101 పరుగులు చేసి అవుటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో యుగల్ షైనీ 2/37, మన్నన్, దేవ్‌లక్ర చెరో వికెట్ తీసుకున్నారు.
151 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్
101 పరుగులు చేసిన అభినవ్

అదరగొట్టిన రాహుల్, అభినవ్