
ఎస్‌జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అండర్ – 19 బ్యాడ్మింటన్, వాలీబాల్ జిల్లా జట్లను గురువారం ఎంపిక చేశారు. అనంతపురంలోని అశోక్‌నగర్‌లో ఉన్న జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్టేడియంలో బ్యా డ్మింటన్, జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ జట్లను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల పర్యవేక్షించారు. వాలీబాల్ బాలుర జట్టులో మణికంఠ, కార్తీక్, సాయిచరణ్, శ్రీకాంత్, పవన్‌కుమార్ నాయక్, ధనుష్‌కుమార్, మధు, విష్ణువర్ధన్, విజయసాయి, రెహమాన్, వంశీ, అమర్ చోటు దక్కించుకున్నారు. బాలికల జట్టుకు సాయిబృందా, యుమున, శాలిని, శ్వేత, బిందు, దీప్తి, వైష్ణవి, నాగరత్న, సుస్మిత, వేదశ్రీ, హసీనా, లాస్య, యస్మిత ఎంపికయ్యారు. అలాగే బ్యాడ్మింటన్ బాలికల జట్టులో ఎ.అన్విత, ఎస్.హిమబిందు, టి.సన్నిధి, వి.విజయలక్ష్మి, పి.దీక్షిత్ నారాయణ చోటు దక్కించుకోగా, బాలురు జట్టుకు బి.యువరాజు, జతిన్ సాయిరెడ్డి, ఎ.అఖిల్, ఎం.రిత్విక్‌సాయి, కె.కార్తీక్‌కుమార్‌రెడ్డి ఎంపికయ్యారు.