
హంద్రీ–నీవా కాలువలో వ్యక్తి గల్లంతు
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందని నాగభూషణం, ఓబులేసు సోమవారం బెళుగుప్ప మండలం జీడిపల్లిలో ఉన్న బంధువు కర్మకాండలకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. హంద్రీ నీవా కాలువ వద్దకు చేరుకోగానే స్నానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఓబులేసుకు ఈత రాకపోవడంతో మెట్ల వెంట దిగి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని వచ్చాడు. అనంతరం నాగభూషణం కాలువలో దిగి ఈత కొడుతూ ప్రవాహ వేగానికి కొట్టుకు పోయాడు. ఆ సమయంలో ఓబులేసు కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసే లోపు నాగభూషణం (62)కనిపించకుండా పోయాడు. సమాచారుం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.