
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా?
పత్రికా స్వేచ్ఛకు, వాక్‌స్వాతంత్య్రపు హక్కుకు సంకెళ్లు వేస్తారా? కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపుతోంది. స్టేట్‌మెంట్ ప్రచురించిన పత్రికపై కేసులు పెట్టడం దారుణం. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధి మీడియా. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి వారి బాధ్యతను గుర్తు చేసి ప్రజలపక్షాన నిలిచి పోరాడేది మీడియా. అలాంటి మీడియా స్వేచ్ఛను అణచివేయడానికి అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. ప్రతిఒక్కరూ ఖండించాలి.
– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా?