
వివాహిత ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: మండలంలోని పల్లేపల్లికి చెందిన వివాహిత చాముండి(22) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పల్లేపల్లిలో నివాసముంటున్న నాగమ్మకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కాగా, రెండో కుమార్తె చాముండికి ఏడాదిన్నర క్రితం కర్ణాటకలోని బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన చిరంజీవితో వివాహమైంది. చిన్నపాటి విషయానికి భార్యతో గొడవపడేవాడు. అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ప్రస్తుతం చాముండి నాలుగు నెలల గర్భిణి. అనారోగ్యంతో బాధపడుతున్న తన అక్కను చూసేందుకు పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అనంతరం రెండు రోజుల క్రితం భర్త అత్తింటికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనుమానంతో ఆమెను దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చాముండి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
● భర్త వేధింపులే కారణం