
సచివాలయాలకు మూత
అనంతపురం కార్పొరేషన్: కూటమి పార్టీల కార్యక్రమం నేపథ్యంలో సచివాలయాలు మూతపడ్డాయి. పైగా ఈ కార్యక్రమానికి తరలించేందుకు సచివాలయ సిబ్బందితోనే జన సమీకరణ చేయించడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లారు. మహిళా సంఘాల సభ్యులు వచ్చారో లేదో నమోదు చేసుకున్నారు. సమావేశానికి రాని వారికి ఫోన్లు చేసి పిలిపించారు. అనంతరం తమ పరిధిలో ఎంత మందిని బస్సుల్లో ఎక్కించారో ఆ వివరాలను ఆయా గ్రూపుల్లో నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో అయితే ఎంత మంది బస్సుల్లో ఉన్నారు.. పూర్తి స్థాయిలో వచ్చారా.. తదితర వివరాలు ఆరా తీసేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఉద్యోగులను పార్టీల కార్యక్రమాలకు వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

సచివాలయాలకు మూత