
బీసీలపై రాజకీయ కక్ష సాధింపులా?
అనంతపురం టవర్‌క్లాక్: రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీసీలపై టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మండిపడ్డారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న జ్యోతి బాపూలే విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజమ్మ మాట్లాడుతూ పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ బీసీ నాయకులపై దాడులకు పాల్పడడం అమానుషమన్నారు. చంద్రబాబుకు బీసీలంటే చిన్న చూపన్నారు. బీసీలు జడ్జిలుగా ఉండకూడదని, బీసీల తోక కట్ చేస్తామని గతంలో ఆయన హేళన చేశారన్నారు. బీసీలపై ఇలాగే దౌర్జన్యాలు కొనసాగిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎన్నికై న అభ్యర్థి మరణిస్తే ఆ స్థానంలో బాధిత కుటుంబ సభ్యులు పోటీలో ఉంటారని, అలాంటి ఎన్నికల్లో సాధారణంగా ఇతర పార్టీల వారు పోటీ చేయరన్నారు. కానీ, సంప్రదాయాన్ని కాలరాస్తూ టీడీపీ అభ్యర్థిని బరిలో దింపారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కానీ ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం అన్యాయ మన్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా పులివెందులలో గెలిచేది వైఎస్సార్ సీపీనే అన్నారు. కార్యక్రమంలో రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీసాల రంగన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు అశ్వర్థ నాయక్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు లక్ష్మన్న, కార్పొరేటర్లు సుమతి, సైపుల్లా బేగ్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి కాగజ్ ఘర్ రిజ్వాన్, నాయకులు అనిల్ కుమార్ గౌడ్, శ్రీనివాసులు, రాంభూపాల్‌రెడ్డి, రామకృష్ణ, రామచంద్ర, జావిద్, నకీబ్, నవీన్ కుమార్, రామ్మూర్తి, చింతకుంట మధు, కేఎం బాషా, రాధా యాదవ్, భారతి, హరీష్ కుమార్ యాదవ్, శ్రీదేవి, వినీత్, జగదీష్, శ్రీనివాసులు, గోగుల పుల్లయ్య, వెన్నం శివారెడ్డి, జానీ, శేఖర్, మహేష్, రఫి పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మండిపాటు