
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆ
హెచ్చెల్సీ అక్విడెక్ట్
కాలువ గట్టుకు కోత
కణేకల్లు: మండలంలోని తుంబిగనూరు వద్ద హెచ్చెల్సీ 159/277 కి.మీ సమీపంలో అక్విడెక్ట్ కాలువ ఎడమవైపు గట్టు ఆదివారం రాత్రి కోతకు గురైంది. గస్తీ నిర్వహించే లస్కర్లు ఈ విషయాన్ని కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌డివిజన్ డీఈఈ దివాకర్‌రెడ్డి, ఏఈఈ నరేంద్ర మారుతి దృష్టికి తీసుకెళ్లారు. రాత్రిపూట అటుపై ఎవరూ వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం హెచ్చెల్సీ అధికారులతో పాటు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్ ఘటన స్థలానికి చేరుకొని హెచ్చెల్సీ గట్టు మరింత కోతకు గురికాకుండా చర్యలు తీసుకొన్నారు. నీటి ప్రవాహానికి అవాంతరాలు కలగకుండా ఇసుక బస్తాలతో రింగ్‌బండ్ వేయించారు. గజ ఈతగాళ్లు, కూలీల సాయంతో కాలువ అడుగు భాగం నుంచి పైవరకు ఇసుక బస్తాలతో బండ్ వేశారు. హెచ్చెల్సీ అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కాలువకు గండి పడకుండా యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవడంతో ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
బెస్ట్ పీఎంశ్రీ స్కూల్‌గా గుత్తి ఏపీ రెసిడెన్షియల్
అనంతపురం ఎడ్యుకేషన్: బెస్ట్ పీఎంశ్రీ స్కూల్‌గా గుత్తి ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఎంపికై నట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్‌ఈపీ) –2020 ఐదో వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశవ్యాప్తంగా బెస్ట్ పీఎంశ్రీ స్కూళ్లను జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా గుత్తి ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని వెల్లడించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ హాజరు కానున్నారు.