
ప్రశ్నించే గొంతుకను హింసించడం తగదు
గుంతకల్లుటౌన్: ఏపీలో సర్కార్ వైఫల్యాలు, మోసాలపై ప్రజల తరపున ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలపై అక్రమ కేసులు పెట్టి హింసించడం తగదని కూటమి ప్రభుత్వ పెద్దలకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి హితవు పలికారు. అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అక్రమమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పిపుచ్చుకునేందుకు లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి సంబంధం లేని వ్యక్తులు, అధికారులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. గతంలో లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఆ కేసు నుంచి బయటపడేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజల్లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకల రామాంజనేయులు, పట్టణ, మండల అధ్యక్షులు ఎండీ.ఖలీల్, పి.రాము, పార్టీ అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు రంగనాయకులు, బాబూరావు, వీరేష్, బాసిద్, కౌన్సిలర్లు చాంద్‌బాషా, సుమోబాషా, సీనియర్ నాయకులు మల్లికార్జున శాస్త్రి, నూర్ నిజామి, ఫ్లయింగ్ మాబు, ఎంఎం రెహమాన్, ఆర్‌డీజీ బాష, మౌలా, బావన్న తదితరులు పాల్గొన్నారు.
మస్తానయ్య ఉరుసు శుభాకాంక్షలు
గుంతకల్లులోని హజరత్ మస్తాన్‌వలి స్వామి దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా భక్తాదులకు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హజరత్ మస్తాన్‌వలి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే మద్యం అక్రమ కేసు
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దుర్మార్గం
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి