
మేం చూసుకుంటాం.. వదిలేయండి..సార్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల కుంభకోణం కథ ‘కంచి’కి చేరినట్లుగా కనిపిస్తోంది. చిన్న విష యాలకే ప్రతిపక్ష పార్టీ నేతలపై సీఐడీ, సిట్‌లతో దర్యాప్తు చేయించి అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేయిస్తున్న కూటమి సర్కారు.. కళ్యాణదుర్గం కేంద్రంగా జరిగిన నకిలీ స్టాంపుల కుంభకోణం కేసును మాత్రం నీరుగా ర్చింది. గతంలో కృష్ణయాదవ్, తెల్గీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ స్టాంపుల కుంభకోణం జరిగింది. తర్వాత ఆ స్థాయిలో జరిగింది మాత్రం ‘దుర్గం’లోనే. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ పెద్దలుండటంతోనే కేసును తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది.
స్థానిక పోలీసులకు అప్పగించినప్పుడే!
తొలుత స్టాంపుల కుంభకోణం బయటపడినప్పుడు ఎస్పీ పరిధిలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కేసు నమోదైన స్టేషన్ పరిధిలోనే దర్యాప్తు చేయాలని కళ్యాణదుర్గం పోలీసులకు బదలాయించారు ఇలా వారికి అప్పగించినప్పుడే సగం దర్యాప్తు చచ్చిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఐడీ లాంటి సంస్థకు కేసును అప్పగించి విచారిస్తే కుంభకోణం వెనుక ఎవరున్నారో తెలిసే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం దీనికి ససేమిరా అంది. అక్రమాలను తవ్వితే తమ పార్టీ నేతల పాత్ర బయటికొస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు ఎలా చెబితే లోకల్ పోలీసులు అలా కేసు రాస్తారని అందరికీ తెలి సిందే. అయినా స్థానిక పోలీసులతోనే దర్యాప్తు మమ అనిపించడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. రాజకీయ పెద్దలు ఉండటంతో కేసు నీరుగార్చినట్టు తెలుస్తోంది. లింకులున్న నేత లంతా అధికార పార్టీ వాళ్లే కావడంతో పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాంపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడు చిన్న చేపమాత్రమే అని, లోతుగా విచారణ చేస్తే పెద్ద చేపలు బయటికొచ్చే అవకాశముందని సర్వత్రా చర్చ జరుగుతోంది.
మీసేవా నిర్వాహకుడు ఈ స్థాయిలో చేయగలడా?
సుమారు రూ.20 కోట్లకు పైగా జరిగిన ఈ– స్టాంపుల కుంభకోణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గంలో మీ–సేవ నిర్వాహకుడు బాబును కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కానీ ఓ చిన్న స్థాయి వ్యక్తి ఇంత పెద్ద స్థాయిలో ‘కంపెనీ’ యాజమాన్యానికి తెలియకుండా అక్రమాలు చేసి ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి ప్రమేయమూ లేకుండా ఈ స్థాయిలో అవకతవకలు చేయడానికి అతనికి అంత శక్తి లేదని, ‘పెద్ద’ సంస్థ అండ లేకుండా భారీ మొత్తంలో బాబు కొల్లగొట్టలేడని నిపుణులు చెబుతున్నారు.
కళ్యాణదుర్గం స్టాంపుల స్కామును పక్కదారి పట్టించిన పెద్దలు
ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు గండి
బడా సంస్థల భాగస్వామ్యం ఉండటంతోనే దర్యాప్తు అటకెక్కినట్టు విమర్శలు
సీఐడీ లాంటి సంస్థలతో దర్యాప్తు చేయాల్సిన స్కాం అంటున్న నిపుణులు
ప్రతిపక్ష నేతలపై చిన్న ఆరోపణలకే సిట్‌లు వేస్తున్న సర్కారు
కోట్లు కొల్లగొట్టిన కేసులో దర్యాప్తు మమ అనిపించిన వైనం